మన ప్రకృతి విపత్తుల నుంచి పం టలను కాపాడుకునేందుకు యాసంగి సీజన్‌ను కొంత ముం దుకు జరపాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వం ఆశలు నెరవేరలే దు. వ్యవసాయరంగానికి ఈసారి నైరుతి రుతుపవనాలు ఆ శించిన రీతిలో అనుకూలించే పరిస్థితులు కనిపించటం లేదు. ఈ నెల 8న ప్రవేశించిన మృగశిర కార్తె చివరి దశకు చేరుకుంది. ఈ కార్తెలో సహజంగానే తొలకరి జల్లులు వ్యవసా య రంగాన్ని పలకరించాల్సివుండగా నైరుతి రుతుపవనాలు అందుకు గండికొట్టాయి. మరో రెండు రోజుల్లో మృగశిర ముగిసి ఆరుద్ర కార్తె ప్రవేశించనుంది. అరుద్ర రెమ్తొలోనూ రుతువవనాల అడ్రస్ కనిపించే పరిస్థితులు లేవు. ఆరుద్ర కా ర్తె సహజంగానే మంచి వర్షాలతో వాతావరణం రైతులకు అ న్ని విధాలుగా అనుకూలించాల్సి ఉంది. అయితే బిపోర్‌జో య్ రూపంలో అరేబియా సముద్రం నుంచి పుట్టుకొచ్చిన తు పాన్ రుతుపవనాల వేగాన్ని స్తంబింపచేసింది.
తెలుగు రాష్ట్రా ల్లో ఉష్ణొగ్రతలు గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో వర్షాలు ఇంకా మరికొన్ని రోజులు ఆలస్యం కా వచ్చని ఐఎండి అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళ తీరాన్ని తాకి దేశంలోకి ప్రవేశించాల్సివుండగా వీటిరాకకోసం దేశప్రజలు ఈనెల 8వరకూ ఎదురు చూడాల్సివచ్చింది. గడిచిన పది రోజుల్లో ఇవి రాయలసీమ వరకూ విస్తరించి అక్కడే ఆగిపోయాయి. గుజరాత్ తీర ప్రాం త జిల్లాలను అతలాకులం చేసిన బిపోర్ జాయ్ తుపాను అల్పపీడనంగా మారుతోందని ఐఎండి వెల్లడించింది. ఆదివా రం నుంచి బుధవారం వరకూ దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు పురోగమనంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఈ పరిస్థితులు అనుకూలం గా మారతాయని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఐఎండి అంచనాలు రైతుల్లో ఆశలు చిగురింప చేస్తున్నాయి. ఈసారి వానాకాల పంట సాగు అంతగా కలిసి రావటం లేదు.
కోటి ఆశలతో ఏరువాకను ఎంతో ఉత్సాహంగా సాగించిన రైతులు వానజాడ లేకపోవటంతో ఉస్సూరు మంటున్నారు. మే నెలలో అక్కడక్కడా వేసిన పత్తి విత్తనాలు కూడా మోసులెత్తకుండానే ఎండిపోయాయి. అక్కడక్కడా కొద్దిపాటి పదునుతో వేసిన పత్తి పైరు కూడా ఎండల ధాటికి వాడుపట్టిపోతోంది. రాష్ట్రంలో ఈ సీజన్‌కు సబంధించి 720 మి.మి వర్షం కురవాల్సివుంది.అందులో జూన్ నెలకు సంబంధించి 129మి.మి కురవాల్సివుండగా ఈ సమయానికి 95మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుంది. 2021 జూన్‌లో ఈ సమయానికి 137మి.మి వర్షపాతం నమోదుకాగా, గత ఏడాది జూన్‌లో కూడా ఈ సమయానికి 108 మి.మి వర్షపాతం నమోదైంది. ఈ సారి జూన్ నెలలో ఇప్పటివరకూ రుతుపవనాల జాడ కూడ లేదు. వ్యవసాయరంగానికి నైరుతి రుతుపవనాల వల్ల కురిసే వర్షమే కీలకం. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ పాటికి జోరుగా పత్తి విత్తనాలు నాటాల్సిన సమయం . గత ఏడాది కూడా ఈ సమయానికి 8.82లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం పడింది. మరో 43వేల ఎకరాల్లలో నూనెగింజ పంటలు సాగులోకి వచ్చాయి.
కంది, పెసర ,మినుము తదితర పప్పుధాన్య పంటల సాగు కూడా 5.74లక్షల ఎకరాలకు చేరుకుంది. వరి మొక్కజొన్న, జొన్న తదితర పంటలు కూడా సాధారణ సాగువిస్తీర్ణంలో జరిగాయి. గత ఖరీఫ్‌లో ఈ సమయానికి రాష్టమంతటా 11.30లక్షల ఎకరాల్లో పంటల సాగుతో సాధారణ విస్తీర్ణతలో 10శాతం కవర్ అయ్యింది.ఈ సారి ఆ ప్రతికూల పరిస్థితుల మధ్య వ్యవసాయరంగం బిక్కుబిక్క మంటోంది.