Monday, December 23, 2024

నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటికి రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ కారణంగా రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. శుక్రవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షం కురిసింది. ఇప్పటికే ఆయా జిల్లాలోని అధికారులకు వర్షసూచనలు జారీ చేసిన ఐఎండీ అప్రమత్తంగా ఉండానలి సూచించింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లోనూ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.

హైదరాబాద్‌లో ముందస్తు చర్యలు :
గత రెండ్రోజుల నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో వర్షం నీళ్లు నిలిచిపోకుండా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముందే డ్రైనేజీ, కాలువలో చెత్తను తొలిగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News