Sunday, November 24, 2024

రెండు రోజుల్లో రాష్ట్రాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు ముఖం చాటేయడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలపైగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అయితే, దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని, ప్రస్తుతం రామగుండం వరకు చేరుకున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో వైపు రుతుపవనాల తిరోగమనం నేపథ్యంలో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ సంవత్సరం తెలంగాణలోని 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా,మిగతా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News