- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి పవనాల రాకతో రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఇవాళ, రేపు చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ ఉదయం కూడా చిరుజల్లులు పడుతున్నాయి.
- Advertisement -