- Advertisement -
న్యూఢిల్లీ: ఐదు రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశమంతటా విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జులై 8న నైరుతి రుతుపవనాలు దేశమంతటికీ విస్తరిస్తుంటాయి. గతంలో జులై 15 నాటికి ఇవి దేశమంతటా విస్తరించేవి. అయితే గత ఏడాది అనేక ప్రాంతాలలో వర్ష నమోదును పురస్కరించుకుని ఈ తేదీలను వాతావరణ శాఖ సవరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో చిట్టచివరిగా వర్షాలు కురిసే రాజస్థాన్‌లోని జైసల్మేర్, గంగానగర్‌కు వర్షాలు విస్తరించినప్పటికీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రం మొహం చాటేశాయి. కాగా, మంగళవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా వర్షాలు పడడంతో నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
- Advertisement -