Saturday, November 23, 2024

దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : సౌత్ జోన్ టీమ్ ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకుం ది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో నార్త్‌జోన్‌ను ఓడించంది. శనివారం చివరి రోజుల సౌత్ జోన్ 215 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు ప్రతి పరుగు కోసం సర్వం ఒడ్డాల్సి వచ్చింది. తొలి రోజు నుంచే పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారింది. దీంతో పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది.

కాగా, నార్త్ జోన్ ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా సౌత్ జోన్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిం ది. ప్రత్యర్థి బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో సౌత్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. అయితే సౌత్ బ్యాటర్లు సమష్టిగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ఫైనల్‌కు చేర్చారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. నార్త్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మయాంక్ ఏడు ఫోర్లతో వేగంగా 54 పరుగులు చేశాడు. కెప్టెన్ హనుమ విహారి తనవంతు పాత్ర పోషించాడు. ధాటిగా ఆడిన విహారి 8 బౌండరీలతో వేగంగా 43 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ రికి భుయ్ కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు.

వేగంగా బ్యాటింగ్ చేసిన రికి 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేశాడు. హైదరాబాదీ యువ సంచలనం తిలక్‌వర్మ రెండు సిక్సర్లతో 25 పరుగులు సాధించాడు. మరోవైపు సాయి కిశోర్ 15 (నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సౌత్ జోన్ జయకేతనం ఎగుర వేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, ఈ మ్యాచ్‌లో నార్త్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేయగా, సౌత్ జోన్ 195 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 211 పరుగులకు ఆలౌటైంది. కాగా, సౌత్ జోన్ బౌలర్లలో తొలి ఇన్నింగ్స్‌లో కవెరప్పా, రెండో ఇన్నింగ్స్‌లో విజయ్‌కుమార్ వైశాక్ ఐదేసి వికెట్లు పడగొట్టారు. ఇక రెండు ఇన్నింగ్స్‌లలో కూడా అర్ధ సెంచరీలతో రాణించిన సౌత్ జోన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు మ్యాచ్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

టైటిల్ పోరుకు వెస్ట్‌జోన్
వెస్ట్ జోన్ సెంట్రల్ జోన్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయతే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన వెస్ట్ జోన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం ప్రారంభమయ్యే ఫైన ల్లో సౌత్ జోన్‌తో వెస్ట్ తలపడుతోంది. వెంగళూరు వేదికగా ఫైనల్ సమరం జరుగనుంది. ఇక సెంట్ర ల్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించిం ది. రింకు సింగ్ (40) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ధ్రువ్ జురేల్ (25), అమన్‌దీప్ ఖేర్ 27 (నాటౌట్), ఉపేంద్ర యాదవ్ 18 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. కాగా, వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220, రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. కాగా, సెంట్రల్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News