Sunday, December 22, 2024

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ షురూ

- Advertisement -
- Advertisement -

ముంబై : సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (ఎస్‌జిబి) 2023-24 రెండో సిరీస్ సోమవారం అంటే సెప్టెంబర్ 11 నుండి ప్రారంభమైంది. సెప్టెంబర్ 15 వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈసారి 1 గ్రాము బంగారం ధర రూ.5,923గా నిర్ణయించారు. పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే రూ.50 తగ్గింపు లభిస్తుంది. సావరిన్ గోల్ బాండ్‌లో 24 క్యారెట్ అంటే 99.9 శాతం స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందవచ్చు.

సావరిన్ గోల్ బాండ్ అనేది ప్రభుత్వ బాండ్, దీన్ని డీమ్యాట్‌గా మార్చుకోవచ్చు. ఐదు గ్రాముల బంగారం బాండ్ అయితే, బాండ్ ధర ఐదు గ్రాముల బంగారం ధరతో సమానంగా ఉంటుంది. దీనిని ఆర్‌బిఐ జారీ చేస్తుంది. ఎస్‌జిబిలలో పెట్టుబడులు 2.50 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. డబ్బు అవసరమైతే, బాండ్‌పై రుణం కూడా తీసుకోవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్(ఐబిజెఎ) రేటు ఆధారంగా బాండ్ ధర నిర్ణయిస్తారు. ఎస్‌జిబిల ద్వారా ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము, గరిష్టంగా 4 కిలోల బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు.

జాయింట్ హోల్డింగ్ విషయంలో 4 కిలోల పెట్టుబడి పరిమితి మొదటి దరఖాస్తుదారుపై మాత్రమే వర్తిస్తుంది. అయితే ఏదైనా ట్రస్ట్ కొనుగోలు గరిష్ట పరిమితి 20 కిలోలు ఉంటుంది. సావరిన్ మెచ్యూరిటీ వ్యవధి 8 సంవత్సరాలు, మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత వచ్చే లాభాలపై పన్ను ఉండదు. అయితే డబ్బును 5 సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకుంటే, దాని నుండి వచ్చే లాభం దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్‌టిసిజి) రూపంలో 20.80 శాతం పన్ను విధిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News