Thursday, April 3, 2025

యుపిలో ఎస్‌పి కూటమి బలం 125

- Advertisement -
- Advertisement -

SP alliance strength 125 in UP

ఎమ్మెల్యేలయిన ఎంపిలు అఖిలేశ్, ఆజం
అసెంబ్లీలో ఉంటారా?
లోక్‌సభనే ఎంచుకుంటారా?

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో బలీయ ప్రతిపక్షంగానే మారిన సమాజ్‌వాది పార్టీ మిత్రపక్షానికి మొత్తం 125 స్థానాలు నమోదు అయ్యాయి. సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కర్హాల్ స్థానం నుంచి గెలిచారు. ఎస్‌పి నేత అయిన ఆజం ఖాన్ రాంపూర్ నుంచి విజయం సాధించారు. అయితే వీరు ఇప్పుడు తమ ఎంపి స్థానాలను వదలుకుంటారా? ఎమ్మెల్యే సీట్లను ఎంచుకుంటారా? అనేది వెల్లడికావాల్సి ఉంది. ఇప్పుడు అఖిలేశ్ ఆజంఘఢ్ నుంచి ఆజం ఖాన్ రాంపూర్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపిలుగా ఉన్నారు. ఈ ఇద్దరూ ఎంపిలుగానే కొనసాగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో ఎస్‌పికి ఇప్పుడు కేవలం ఐదుగురు సభ్యులే ఉన్నారు. ఈ దశలో దిగువసభలో పార్టీ బలాన్ని మరింత దిగజార్చుకునేందుకు ఎస్‌పి నాయకత్వం సిద్ధంగా లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఇరవురు నేతలు శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానాలకు ఉప ఎన్నికలకు ఎస్‌పి సిద్ధం అవుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News