లక్నో : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గురువారం 56 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. యూపీ ఎన్నికల్లో ఎస్పీ జయంత్ చౌదరీ నేతృత్తవం లోని రాస్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి)తోపాటు ఓం ప్రకాష్ రాజ్‌భర్ సారధ్యం లోని సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ సహా పలు ఇతర చిన్న పార్టీలతో కలసి పోటీ చేస్తోంది.
ఇతర పార్టీల ఎత్తుగడలు
మరోవైపు జయంత్ చౌదరిని కాషాయ పార్టీ లోకి రావాలని బీజేపీ నేతలు కోరుతుంటే జాట్‌ల ఓట్లను కావాలనుకుంటే జయంత్ చౌదరిని డిప్యూటీ సిఎంగా ప్రకటించాలని ఆర్‌ఎల్‌డీ నేత అనిల్ చౌదరి డిమాండ్ చేశారు. ఇక యోగి ఆదిత్యనాధ్ సారధ్యం లో మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని బీజెపీ ప్రయత్నిస్తుంటే యోగిసర్కార్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేశ్ నేతృత్వం లోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్‌తో ఉనికి చాటేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతుండగా, మాయావతి సారధ్యం లోని బీఎస్పీ ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు శ్రమిస్తోంది.