Monday, December 23, 2024

భారత జిడిపి అంచనాలకు ఎస్ అండ్ పి కోత

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు అంచనాల్లో అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పి) కోత పెట్టింది. 2023 ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి నమోదుచేయొచ్చని పేర్కొంది. గతంలో 7.3 శాతం వృద్ధి రేటు ఉండొచ్చని పేర్కొన్న ఆ సంస్థ తాజాగా 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది.‘‘2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఉత్పత్తి 7 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతం మేరకు విస్తరిస్తుంది” అని S&P గ్లోబల్ రేటింగ్స్ ఆసియా-పసిఫిక్ చీఫ్ ఎకనామిస్ట్ లూయిస్ కుయిజ్ చెప్పారు. కాగా గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఇన్క్. వచ్చే ఏడాది భారతదేశ ఆర్థిక వృద్ధి మందగించొచ్చంది.  అధిక రుణ ఖర్చులు,వినియోగదారుల డిమాండ్‌కు దెబ్బ, అదే సమయంలో దాని వృద్ధి అంచనా తగ్గొచ్చంది.

ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం, అధిక ద్రవ్యోల్బణం, రుతుపవనాల అసమాన పంపిణీ, ప్రపంచ వృద్ధి మందగించడం వంటి కారణాలతో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ కూడా 2022లో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను 7.7% నుండి 7%కి తగ్గించింది. స్టాండర్డ్ అండ్ పూర్ 2024 ఆర్థిక సంవత్సరపు వృద్ధి అంచనాలను కూడా తగ్గించింది. ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతం వృద్ధి రేటు నమోదవ్వొచ్చని పేర్కొంది. ఈ ఏడాది చివరి వరకు ఆర్థిక ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువ ఉండొచ్చని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News