చివ్వెంల : వచ్చే యేడాది(2023) జరగనున్న దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర యొక్క జాతర ప్రాంగనాన్ని దేవాలయ ప్రదేశం, గట్టు ప్రాంగణాన్ని, తలనీలాల ప్రదేశం, నీటి సౌకర్యం, గట్టు పైకి వచ్చి పోయే మెట్లను జిల్లా ఎస్పి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం జాతరకు వచ్చే భక్తుల అవసరాలకు తగ్గట్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు భద్రత ఏర్పాట్లను చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పి ఆదేశించారు.
ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని కొరారు. వ్యాపార సముదాయం, భక్తుల రద్దీ, జాతీయ రహదారి దృష్టలో ఉంచుకుని ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ చేయాలని అన్నారు. డిఎంఆర్ అధికారులు జాతీయ రహదారి పై బారికెడ్స్ ఏర్పాటు, డివైడర్, డైవర్షన్ అంశాలను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎస్పి వెంట డిఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వరరెడ్డి, సిఐ సోమ్ నారాయణ్ సింగ్, ఎస్సై విష్ణు, జిఎంఆర్ సిబ్బంది, దేవాలయ అర్చకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.