సీతాపూర్ (యుపి): సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఆజమ్‌ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్‌లకు కరోనా పాజిటివ్ సోకడంతో వారిని లక్నో లోని ప్రైవేట్ ఆస్పత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. లక్నో కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీలో చికిత్స కోసం మే2న జైలు అధికారులు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఆయన జైలు నుంచి బయటకు వెళ్ల డానికి ఒప్పుకోలేదు. అయితే ఎక్కువ కాలం మెరుగైన వైద్యం కోసం లక్నోకు తీసుకెళ్లడం తప్పనిసరి అని జిల్లా అధికార యంత్రాంగం చెప్పడంతో చివరకు ఆయన ఒప్పుకున్నారు. ఏప్రిల్ 30 న ఆజమ్‌ఖాన్‌కు, ఆయన కుమారునికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మరో 13 మంది సహచర ఖైదీలకు కూడా కరోనా పాజిటివ్ సోకింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఆజంఖాన్, ఆయన కుమారుడు, భార్య జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. డిసెంబర్‌లో ఆజంఖాన్ భార్య తాజీన్ ఫత్మా కు అలహాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.