Monday, December 23, 2024

సీతాపూర్ జైలు నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఎస్పీ నేత ఆజంఖాన్

- Advertisement -
- Advertisement -

SP leader Ajankhan filed nomination from Sitapur jail

లక్నో : యూపీ ఎన్నికలకు ఎస్పీ నేత మహ్మద్‌ ఆజం ఖాన్ సీతాపూర్ జైలు నుంచి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆజంఖాన్ జైలు నుంచి తన రాంపూర్ సదర్ స్థానానికి నామినేషన్ పత్రాలను సమర్పించారని ఆయన ఎలెక్షన్ ఏజెంట్ ఆసిం రజా ధ్రువీకరించారు. భూకబ్జా సహా అనేక ఆరోపణలపై ఆజంఖాన్ 2020 ఫిబ్రవరి నుంచి సీతాపూర్‌జైలులో ఉంటున్నారు. ఆజంఖాన్ నామినేషన్‌ను తాను ఇవాళ దాఖలు చేశానని, అన్నిలాంఛనాలు పూర్తి చేశామని, ఆయనను బెయిలుపై బయటకు రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని ఆసీం రజా గురువారం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News