Monday, January 20, 2025

జైలులో ఓ ఇన్‌స్పెక్టర్ నేను ‘ఎన్‌కౌంటర్’ అవుతానన్నాడు: ఆజమ్ ఖాన్

- Advertisement -
- Advertisement -
Azam Khan
రామ్‌పూర్ ఎంఎల్‌ఏ ఆజమ్ ఖాన్ రెండేళ్లుగా జైలు జీవితం గడిపారు. ఆయన శుక్రవారం ఉదయం సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు.

న్యూఢిల్లీ: విడుదలయ్యాక ఎన్‌కౌంటర్ అవుతానని జైలులో ఓ ఇన్‌స్పెక్టర్ తనని హెచ్చరించనట్లు సామాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజమ్ ఖాన్ పేర్కొన్నారు. భూకబ్జా కేసులో ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. రామ్‌పూర్‌లో ఆదివారం విలేకరులతో ఆజమ్ ఖాన్ మాట్లాడుతూ “ నీ మీద చాలా కేసులు ఉన్నాయి. నిన్ను ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉంది. అజ్ఞాతంలోకి(అండర్‌గ్రౌండ్‌లోకి) వెళ్లిపో’ అని జైలులో ఓ ఇన్‌స్పెక్టర్ నన్ను బెదిరించాడు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో నేను ఎటు వెళుతున్నానో చెప్పడం కూడా కష్టమే” అని చెప్పారు. రామ్‌పూర్ ఎంఎల్‌ఏ అయిన ఆయన శుక్రవారం ఉదయం రామ్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. దానికి ఒక రోజు ముందు ఆయనకు సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ప్రత్యేక పరిస్థితుల కింద ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసింది.
“ఆజమ్ ఖాన్‌పై 81 కేసులున్నాయి. ఆయన జైలులో గడిపారు. ఆయనకు మొత్తం 81 కేసుల్లో బెయిల్ ఆర్డర్ లభించడంతో ఈ రోజు ఉదయం విడుదల చేశాం” అని సీతాపూర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ సురేశ్ సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News