Wednesday, January 22, 2025

యుపి అసెంబ్లీకి ఎస్‌పి ఎమ్‌ఎల్‌ఎ దారాసింగ్ చౌహాన్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్ మయు జిల్లా ఘోసి నియోజక వర్గ సమాజ్ వాది పార్టీ (ఎస్‌పి) ఎమ్‌ఎల్‌ఎ దారాసింగ్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ అసెంబీ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. స్పీకర్ సతీష్ మహానాకు చౌహాన్ తన రాజీనామా సమర్పించారని , అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దుబే ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రి మండలి నుంచి చౌహాన్ గత ఏడాది జనవరిలో రాజీనామా చేసి సమాజ్ వాది పార్టీలో చేరారు. రాజీనామాకు దారి తీసిన కారణాల గురించి అడగ్గా, చెప్పడానికి ఆయన నిరాకరించారు. రాజీనామా లేఖలో కూడా కారణాలేవీ వివరించలేదు.

ఒబిసి నాయకుడైన చౌహాన్ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం లో అడవులు, పర్యావరణ మంత్రిగా పని చేశారు. 2022 జనవరి 12న మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2017 నుంచి 2022 వరకు మయు జిల్లా మధుబన్ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహించారు. 15 వ లోక్‌సభలో ఘోసి నియోజక వర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. 2015లో బీజేపీలో చేరిన చౌహాన్ పార్టీ ఒబిసి మోర్చా అధ్యక్షునిగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News