Monday, December 23, 2024

అఖిలేష్ వైఖరిని విమర్శిస్తూ ముస్లిం నేత రాజీనామా

- Advertisement -
- Advertisement -

SP Muslim leader resigns over criticism of Akhilesh

సహరాన్‌పూర్: సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ముస్లింలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు ఆజమ్ ఖాన్ అరెస్టుపై అఖిలేష్ యాదవ్ మౌనాన్ని నిరసిస్తూ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ జిల్లా విభాగంలో అనేక పదవులు నిర్వహించిన సికందర్ అలీ ప్రకటించారు. గత కొంతకాలంగా ఆయన ముస్లింల పట్ల అఖిలేష్ యాదవ్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ సారథ్యంలో ఉన్నప్పటి పార్టీకి ఇప్పటి పార్టీకి చాలా తేడా ఉందని సికందర్ అలీ ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఓట్లతోనే అఖిలేష్ 111 సీట్లు గెలిచారని, అయినప్పటికీ ఆయన పార్టీ నాయకులు ఆజమ్ ఖాన్, నహీద్ ఖాన్ అరెస్టులపై పెదవి విప్పడం లేదని సికందర్ అలీ ఆరోపించారు. తన ఎమ్మెల్యేల కోసం నిలబడలేని నాయకుడు పార్టీ కార్యకర్తలకు ఎలా అండగా ఉంటాడని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News