Monday, December 23, 2024

ఓట్ల లెక్కింపు దాకే ఎస్పీ, ఆర్‌ఎల్‌డి పొత్తు : అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

SP- RLD alliance till vote count: Amit Shahలక్నో : ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీల మధ్య పొత్తు ఓట్ల లెక్కింపు జరిగేంతవరకేనని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. ఒకవేళ సమాజ్‌వాది నేతృత్వం లోని కూటమి అధికారం లోకి వస్తే జయంత్ చౌదరి నేతృత్వం లోని ఆర్‌ఎల్‌డీ పార్టీని కూటమి నుంచి బయటికి గెంటేస్తారని అన్నారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎలాగైనా అధికారం లోకి రావాలనే ఉద్దేశం తోనే రాష్ట్రంలో చాలా చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడని అయితే ఈ ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీకి పెద్దగా విజయం దక్కే అవకాశాలు లేవని పేర్కొన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని అమిత్‌షా వ్యాఖ్యానించారు. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అఖిలేశ్ ఆర్‌ఎల్‌డిని దూరంపెడతారని, పైగా జైల్లో ఉన్న ఆజాంఖాన్‌ను బయటికి తీసుకొచ్చి ప్రభుత్వంలో కూర్చోపెడతారని అమిత్ షా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News