Wednesday, January 22, 2025

సిసి కెమెరాలను ప్రారంభించిన ఎస్పి రోహిణి ప్రియదర్శిని

- Advertisement -
- Advertisement -
  • సొంత డబ్బులతో గ్రామస్థులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన ఎస్‌ఐ సత్యనారాయణ

రేగోడు: ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని అన్నారు. గురువారం సాయంత్రం రేగోడు మ ండలంలోని తాటి పల్లి, తిమ్మాపూర్ గ్రామాలను ఆకస్మికంగా సందర్శించిన మెదక్ జిల్లా ఎస్పి ప్రియదర్శిని తాటిపల్లి గ్రామంలో సిసిటివి కెమెరాలను ప్రా రంభించారు. అనంతరం సిపిఆర్ విధానం ద్వారా ట్రేస్ అవుట్ అయిన మొబైల్ ని మొబైల్ పొగొట్టుకున్న సరస్వతికి అందజేశారు. అనంతరం పోలీస్ స్టే షన్‌ల్లో మహిళా పోలీస్ విశ్రాంత గారి గదిని ఆమె ప్రారంభించారు. తరువాత తిమ్మాపూర్ గ్రామంలో యువకులకు ఎస్‌ఐ సత్యనారాయణ స్వయంగా తన సొంత డబ్బులతో కొనుగోలుచేసిన 20 హెల్మెట్లని జి ల్లా ఎస్పి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంత రం ఆమె మాట్లాడుతూ మొబైల్ ట్రేస్ అవుట్ లో తెల ంగాణలో మెదక్ జిల్లా ఆరో స్థానంలో ఉందని సేవ అందించడంలో ముందున్నారన్నడానికి నిదర్శనం అన్నారు. అదేవిధంగా సత్యనారాయణ ప్రతి చిన్న విషయాన్ని పూర్తిగా లా అండ్ ఆర్డర్ పరిధిలో ఉంచగలిగారని, అదేవిధంగా మహిళా పోలీస్ కొరకు విశ్రాంత గదిని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సంగయ్య, నిర్మల దర్శన్, సిఐ జార్జ్, ఏఎస్‌ఐ మల్లయ్య సిబ్బంది తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News