Sunday, January 19, 2025

యుపి లోక్‌సభ సీట్లకు ఎస్‌పి మూడో జాబితా

- Advertisement -
- Advertisement -

ఐదుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటన
బుదౌన్ నుంచి శివపాల్ యాదవ్ పోటీ

లక్నో : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్ నుంచి మరి ఐదుగురు అభ్యర్థులతో మూడవ జాబితాను సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) మంగళవారం విడుదల చేసింది. బుదౌన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత శివపాల్ యాదవ్‌ను పార్టీ నిలిపింది. పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బాబాయి అయిన శివపాల్ యాదవ్ ప్రస్తుతం ఇటావా జిల్లాలో జస్వంత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా ఉన్నారు.

తాజా జాబితాలోని ఇతర అభ్యర్థులు & సురేంద్ర సింగ్ పటేల్ (వారణాసి), ఇక్రా హసన్ (కైరానా), ప్రవీణ్ సింగ్ ఆరోన్ (బరైలీ), అజేంద్ర సింగ్ రాజ్‌పుత్ (హమీర్‌పూర్). ఈ జాబితాతో యుపి నుంచి లోక్‌సభ సీట్లకు ఎస్‌పి ఇంత వరకు 31 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లు అయింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్‌పి ఇండియా కూటమిలోని తమ భాగస్వామ్య పక్షం కాంగ్రెస్‌కు 17 లోక్‌సభ సీట్లను ప్రతిపాదించింది. యుపిలో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News