Thursday, January 23, 2025

ఈద్గా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్‌పి

- Advertisement -
- Advertisement -

తాండూర్ రూరల్: మండల పరిధిలోని చెన్‌గేస్‌పూర్ గ్రామంలో ఈద్గా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మత పెద్దలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ పండగకు ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు వీలుగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

అల్లా దీవెనల వల్ల బక్రీద్ పండుగను ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆయన ముస్లిం సోదరులను కోరారు. పండగ రోజు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శేఖర్‌గౌడ్, రూరల్ సీఐ రాంబాబు, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి బిఆర్‌ఎస్ తాండూర్ టౌన్ అధ్యక్షుడు అప్పు (నయూం), ఈద్గా మత పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News