అంతరిక్షంలో ఎలాంగి సాగు నేలలు కానీ, తోటలు కానీ లేకుండా ల్యాబ్ లోనే పంటలను పండించి, వ్యోమగాములకు అందుబాటు అయ్యేలా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈమేరకు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రం లోని మీనియేచర్ గ్రీన్ హౌజ్ ల్యాబ్‌లో టమోటాలు పండించ గలిగారు. 90, 97,104 రోజుల వారీగా మూడు రకాలుగా పంటను పండించారు. పండిన టమోటాలను గడ్డ కట్టించి వాటి లోని పోషక విలువలను కూడా పరీక్షించారు.
Also read: Black Fever: బ్లాక్ ఫీవర్ చాలా డేంజర్
ఈ విధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పండించిన టమోటాలను శనివారం భూమి మీదకు తీసుకు వస్తున్నట్టు నాసా వెల్లడించింది. స్పేస్ ఎక్స్ సీఆర్‌ఎస్ 27 కార్గో ద్వారా టమోటాలు నాసాకు చేరుకోనున్నాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా దాదాపు రెండు వేల కిలోల బరువు ఉన్న వస్తువులను తీసుకు రానున్నారు. జపాన్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసిన క్రిస్టల్స్ కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి రానున్నాయి. మైక్రో గ్రావిటీ లో సేకరించిన రక్త నమూనాలను కూడా తీసుకు వస్తున్నారు.
Space tomatoes, heart studies, and other @ISS_Research experiments are heading back to Earth this weekend on @SpaceX's #CRS27, the latest cargo return from the @Space_Station.
Undocking coverage begins Saturday, April 15, at 10:45am ET (1445 UTC): https://t.co/nHhw9JyUQB pic.twitter.com/vSDfn6MsB5
— NASA (@NASA) April 12, 2023