Saturday, November 23, 2024

పుడమికి సురక్షితంగా దిగిన స్పేస్ ఎక్స్ క్యాప్సుల్

- Advertisement -
- Advertisement -

Space-Capsule

Ametueur Crew

కేప్ కెనెరవాల్: పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులతో మూడు రోజులపాటు పరిభ్రమించిన స్పేస్ ఎక్స్ అనే పూర్తి ఆటోమేటెడ్ క్యాప్సుల్ ఆదివారం ఫ్లోరిడా తీరంలోని అట్లాంటిక్ సముద్రంలో సురక్షితంగా దిగింది. సూర్యాస్తమయానికి ముందే అది ప్యారాచూట్ ద్వారా దిగింది. నలుగురు సాధారణ పౌరులు(అమెచ్యుర్ క్య్రూ) ఎలాంటి సుశిక్షిత వ్యోమగాముల సాయం లేకుండా ఓ ఛార్టెడ్ వ్యోమనౌక ద్వారా రోదసిలోకి వెళ్ళడం, భూమిని చుట్టడం ఇదే తొలిసారి. అపర కుబేరుడుజేర్డ్ ఐజాక్‌మన్ సారథ్యంలో ఈ రోదసి యాత్ర సాగింది.

మూడు రోజులపాటు రోదసిలో పర్యటించిన ఆ సాధారణ వ్యోమగాములు చివరికి ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో దిగారు. తొలిసారిగా రోదసిలో పర్యటించిన ఈ నలుగురు ప్రైవేట్ వ్యక్తులు: ఐజాక్‌మన్(38), హేలీ ఆర్సినో(29), క్రిన్ సెంబ్రోస్కి(42), సియాన్ ప్రాక్టర్(51).

ఓ బిలియనీర్ ఎన్నో మిలియన్ డాలర్లు వెచ్చించి తన ముగ్గురు అతిథులను రోదసి పర్యటనలోకి తీసుకెళ్ళాడు. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తన కంపెనీ తొలి రాకెట్ ద్వారా వారిని రోదసి పర్యటన చేయించారు. ఎలాన్ మస్క్ కోట్లాది డాలర్ల విలువైన అంతరిక్ష పర్యాటక వ్యాపారంలో దిగారన్నది ఇక్కడ గ్రహించాలి. ఆయన ‘ఇన్‌స్పిరేషన్ 4’ పేరిట ఈ రోదసి యాత్రను నిర్వహించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ రాకెట్ ద్వారా ‘క్రూ డ్రాగన్’ వ్యోమనౌక బుధవారం రాత్రి నింగిలోకి వెళ్లింది. ఆ రాకెట్‌ను ప్రయోగించిన 10 నిమిషాలకే అది భూకక్ష్యలోకి  ప్రవేశించింది. చివరికి అది భూమికి 575 కిమీ. ఎత్తుకు వెళ్లింది. అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) ఉన్న కక్ష్యకన్నా 160 కిమీ. ఇంకా ఎత్తు అన్నది ఇక్కడ గమనార్హం. హబుల్ టెలిస్కోపు ఉన్న ప్రాంతాన్ని కూడా ‘క్రూ డ్రాగన్’ దాటింది. గంటకు 27,360 కిమీ. వేగంతో 90 నిమిషాలకోసారి అది భూమిని చుట్టింది.ధ్వని వేగం కన్నా 22 ఎక్కువ వేగంతో అది పయనించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News