Monday, January 20, 2025

దివి నుంచి తిరిగి భువికి వ్యోమగాములు

- Advertisement -
- Advertisement -

SpaceX ferries astronauts back to Earth

ఆర్నేళ్ల తరువాత స్పేస్ స్టేషన్ ఫ్లోరిడా

కెప్ కెనవెరాల్ (అమెరికా) : మరో ప్రపంచం వంటి అంతరిక్షంలో వారు ఆరు నెలలు గడిపి తిరిగి శనివారం అమెరికాలోని తమ నేలకు చేరారు. ఆర్నెళ్ల స్పేస్ స్టేషన్ బస తరువాత నలుగురు వ్యోమగాములు స్పేస్ ఎక్స్ క్యాప్సుల్‌లో ఫ్లోరిడా సమీపంలో అట్లాంటిక్‌లో దిగారు. తరువాత క్షేమంగా తీరానికి వచ్చారు. ఫ్లోరిడాలో తేమ, గాలుల నడుమ వాతావరణం ఉండటంతో స్పేస్ ఎక్స్ , నాసాకు చెందిన క్యాప్సుల్‌లో వీరి తిరిగి రాక కొద్దిగా ఆలస్యం అయింది. శుక్రవారం పూర్తిగా వాతావరణం అనుకూలించిన తరువాత వీరి తిరుగముఖానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఐదుగంటలకే ఈ వ్యోమగాములు ఇన్నాళ్లు దూరం అయిన భూమికి చేరారు. నాసా వ్యోమగాములు జెల్ లిండ్గ్రెన్, బాబ్ హైన్స్, జెసికా వాట్కిన్స్ ఉన్నారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సమంతా క్రిస్టోఫోర్టి కూడా వీరిలో ఉన్నారు.

తనిఖీల తరువాత ముఖాలు ఇన్నాళ్లకు తిరిగి గూటికి చేరామనే సంతోషంతో వెలిగాయి. ఇక తాము ఆగలేమని కూల్ డ్రింక్‌ను ఐస్‌తో కలిసి తీసుకుంటామని, పిజా మధ్యలో ఐస్‌క్రిమ్ లాగిస్తామని ,తరువాత స్నానం చేసి సేదదీరుతామని , ప్రకృతితో ఉల్లాసంగా ఉంటామని అన్నింటికీ మించి కుటుంబాల చెంతకు వెళ్లుతామని తెలిపారు. ముందు జరిగే కొన్ని ఆలింగనాలు , తరువాతి ముద్దులు ఇవన్నీ తమకు అత్యంత ఆహ్లాదకరమైనవని స్పందించారు. ఇప్పటికీ స్పేస్ స్టేషన్‌లో ముగ్గురు అమెరికన్లు ఉన్నారు. ముగ్గురు రష్యన్లు, ఓ జపనీ కూడా అక్కడ బసలో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News