Friday, November 15, 2024

ఇవిగోఅవకాడోలు.. పూలు పండ్లు

- Advertisement -
- Advertisement -
Spacex launches ants, avocados, robot to space station
అంతరిక్ష స్నేహితులకు మస్కు కానుకలు

కేపెకెనరావల్/ న్యూయార్క్: అంతరిక్ష వాణిజ్యంలోకి దూసుకువెళ్లిన బిలియనీర్ ఎలాన్ మస్కుకు చెందిన స్పేస్ ఎక్స్ రోదసీలోని వ్యోమగాములకు కానుకలు పంపించింది. అత్యంత పుష్టికరమైన అవకాడో చెర్రి ఫలాలు, చీమలు , మనిషి ఎత్తులో ఉండే రోబో చేయిని ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పంపించింది. నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ పంపిణీ ప్రయాణపు ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇప్పుడు ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు. వీరికి బలవర్థకపు సరుకులతో కూడిన వాటిని డ్రాగన్ క్యాప్సూల్స్‌లో ఉంచి నవీకరించిన ఫాల్కన్ రాకెట్ ద్వారా తెల్లవారుజామున విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. ఈ డ్రాగన్ క్యాపూల్స్ సరుకులు సోమవారానికి అంతరిక్ష కేంద్రానికి చేరుతాయి. అక్కడి వ్యోమగాములకు అందే సరుకుల జాబితాలో చీమలు, అవకాడోలతో పాటు ఐస్‌క్రీంలు, పరిశోధనలకు వాడే మొక్కలు , కొన్ని రకాల విత్తనాలు ఉంటాయి. జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించిన భారీ స్థాయి రోబోటిక్ చేయి కూడా అందుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News