ఫ్లోరిడా: నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘పొలారిస్ డాన్’ అనే వ్యోమనౌకను మంగళవారం నాసాకు చెందిన ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది. ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా వ్యోమగాములు ‘స్పేస్ వాక్’ చేసి చరిత్ర సృష్టించనున్నారు.
ఈ సాహస యాత్ర(మిషన్) ఆరు రోజులది. ఇద్దరు వ్యోమగాములు ప్రైవేట్ సంస్థ నిర్వహించే స్పేస్ వాక్ ను ప్రపంచం చూడనున్నది. ఈ ‘స్పేస్ వాక్’ మూడో రోజున జరుగనున్నది.
ప్రపంచ సంపన్నుడు అయిన ఎలన్ మస్క్ కంపెనీ నలుగురు వ్యోమగాములను భూ కక్ష్య(ఎర్త్ స్ ఆర్బిట్)లోకి పంపుతోంది. వ్యోమగాములు కంపెనీ ‘క్రూ డ్రాగన్ క్యాప్సుల్’ ద్వారా ఈ రోదసి యాత్ర చేస్తున్నారు. పొలారిస్ ప్రొగ్రామ్ తాలూకు మూడు మిషన్స్ లో ‘పొలారిస్ డాన్’ మొదటిది. ఇక క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ను ‘రెసిలెన్స్’ అని పిలుస్తున్నారు. అయితే ఈ మిషన్ అంతర్జాతీయ రోదసి స్టేషన్(ఐఎస్ఎస్) తో డాక్ కాబోదు. భూకక్ష్య 1367 కిమీ. చుట్టూ వ్యోమగాములు భ్రమణం చేస్తారు. అంతర్జాతీయ రోదసి కేంద్రం నుంచి భూమికి దాదాపు 400 కిమీ. దూరం. కాగా దీనికి మూడు రెట్ల మేరకు ఈ రోదసి మిషన్ ఉండబోతుంది. ఈ రోదసి యాత్రలో బిలియనీర్ జరేడ్ ఇస్సాక్మన్, స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు సరా గిల్లీస్, అన్నా మీనన్, అమెరికా వైమానిక దళం మాజీ పైలట్ స్కాట్ పొటీట్ పాల్గొంటున్నారు.