కేప్‌కెనవెరల్ (అమెరికా): చంద్రునిపై శ్వేతజాతేతర మహిళను తప్పనిసరిగా పంపాలన్న లక్షంతో స్పేస్ ఎక్స్ సంస్థను నాసా ఎంచుకుంది. వచ్చేవారం అంతరిక్షం లోకి వెళ్లడానికి స్పేస్ ఎక్స్‌కు చెందిన అంతర్జాతీయ వ్యోమగాముల బృందం ఫ్లోరిడాకు రానున్నారని ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లో స్పేస్ ఎక్స్‌ను ఎంపిక చేసినట్టు నాసా ప్రకటించింది. చంద్ర యాత్ర తోనే తాము ఆగిపోమని, అంగారక యాత్ర తమ అంతిమ లక్షమని సాసా తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ జుర్క్‌జిక్ పాత్రికేయులకు చెప్పారు. అయితే చంద్రయాత్రకు సంబంధించిన ఆర్టెమిస్ మిషన్ తేదీ ఎప్పుడో ప్రకటించలేదు. ఎప్పుడు క్షేమమో అప్పుడు తాము ఈ చంద్రయాత్ర చేపడతామని నాసాకు చెందిన కతీలూడర్స్ చెప్పారు. వ్యోమగాములు నాసా ప్రయోగించిన ఓరియాన్ కాప్యూల్‌లో చంద్రయాత్రకు బయలుదేరి వెళ్తారని, తరువాత చంద్రుని పై దిగడానికి కక్ష లోని స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ లోకి మారతారని వివరించారు.