Wednesday, January 22, 2025

సౌదీ మహిళతో ’స్పేస్ ఎక్స్‘ యాక్సియమ్ మిషన్-2 ప్రారంభం

- Advertisement -
- Advertisement -

టెక్సాస్: యాక్సియమ్ స్పేస్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) ప్రైవేట్ మిషన్ ఫ్లోరిడా నుండి ఆదివారం ‘ఎఎక్స్-2’ను అంతరిక్షంలోకి ప్రయాణించడానికి తన సిబ్బందిలో సౌదీ మహిళను కూడా చేర్చినట్లు యాక్సియమ్ స్పేస్ పేర్కొంది. రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలు రయ్యానా బర్నావి, మరో సౌదీ జాతీయుడు అలీ అల్‌ఖర్నీతో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి సౌదీ మహిళ.

ఫ్లోరిడాలోని నాసా యొక్క కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఎ నుండి మే 21న ఆదివారం సాయంత్రం దీనిని ప్రయోగించారు. ఇదో ఫండెడ్ మిషన్. ఏవియేటర్ టెనస్సీలోని నాక్స్‌విల్లేకు చెందిన జాన్ షాఫ్నర్ పైటల్‌గా వ్యవహరిస్తున్నారు. సౌదీకి చెందిన ఇద్దరు జాతీయ వ్యోమగామి కార్యక్రమంలో సభ్యులుగా ఉన్నారని యాక్సియమ్ స్పేస్ రిపోర్టు చేసింది.

33 ఏళ్ల బర్నావి యువ ప్రయోగశాల నిపుణురాలు, ఆమె క్యాన్సర్ మూలకణాల పరిశోధనలో అపారమైన అనుభవం కలిగి ఉంది. ఆమె ప్రస్తుతం పరిశోధన, ప్రయోగాశాల స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో సౌదీ అరేబియా 2023 రెండో త్రైమాసికంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) మొదటి సౌదీ మహిళా వ్యోమగామి రేయానా బర్నావి, పురుష వ్యోమగామి అలీ అల్‌ఖర్నీలను పంపుతున్నట్లు ప్రకటించింది.

మానవాళికి సేవ చేయడం, అంతరిక్ష పరిశ్రమ అందించే ఆశాజనక అవకాశాల నుండి ప్రయోజనం పొందడం, అలాగే ఆరోగ్యం, స్థిరత్వ, అంతరిక్ష సాంకేతికత వంటి అనేక అంశాలలో శాస్త్రీ పరిశోధనలకు దోహదపడడం వంటి మానవ అంతరిక్షయానంలో సౌదీ శాస్త్రవేత్తల సామర్థాలను సాధికారపరచడమే ఈ యాత్ర లక్ష్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News