Thursday, January 23, 2025

స్పేస్‌ఎక్స్ భారీ రాకెట్ ప్రయోగం వాయిదా

- Advertisement -
- Advertisement -

టెక్సాస్ : చంద్రుడితోపాటు అంగారక గ్రహం పైకి వ్యోమగాములను, వారివెంట సరకులను పంపడానికి అమెరికా ప్రభుత్వంతో కలిసి స్పేస్ ఎక్స్ సిద్ధం చేసిన భారీ వ్యోమనౌక ప్రయోగం సోమవారం జరగవలసి ఉండగా వాయిదా పడింది. ఎలాన్ మస్క్, ఆయన కంపెనీ దాదాపు 400 అడుగుల స్టార్‌షిప్ రాకెట్‌ను టెక్సాస్ దక్షిణ చివరి భాగం మెక్సికో సరిహద్దు సమీపం నుంచి ప్రయోగించడానికి సన్నాహాలు చేశారు. అయితే మొదటి దశ బూస్టర్ లో సాంకేతిక సమస్య ఎదురుకావడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. కనీసం బుధవారం వరకైనా మళ్లీ ఈ ప్రయోగం జరగక పోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News