Sunday, January 12, 2025

230 మీటర్ల దూరంలో స్పేడెక్స్ రెండు శాటిలైట్లు

- Advertisement -
- Advertisement -

స్పేడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ ) రెండు శాటిలైట్లు ప్రస్తుతం 230మీటర్లదూరంలో ఉన్నాయని ఇస్రో వెల్లడించింది.శుక్రవారం సాయంత్రానికి ఈ రెండు శాటిలైట్లు 1.5 కిమీ దూరంలో ఉండగా శనివారం ఉదయానికి 500 మీటర్ల దూరం లోఉన్నాయని , ఇప్పుడు వాటి మధ్య దూరం 230మీటర్లకు తగ్గిందని పేర్కొంది. వాటి ఆరోగ్యం మామూలుగానే ఉందని తెలియజేసింది. ఆ రెండు శాటిలైట్లను ఒకే కక్షలోకి తీసుకు వచ్చి విలీనం చేయాలన్నదే ఇస్రో ఆకాంక్ష.

ఈ డాకింగ్ ప్రయోగం ఎప్పుడు జరుగుతుందో ఇస్రో వివరించలేదు. డాకింగ్ ప్రయోగం చేయాలనుకున్నా రెండు సార్లు జనవరి 7, 9 తేదీల్లో వాయిదా పడింది. డిసెంబర్ 30న స్పేడెక్ప్ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పిఎస్‌ఎల్‌వి సి 60 రాకెట్ ఎస్‌డిఎక్స్ (చేజర్), ఎస్‌డిఎక్స్ 02 అనే చిన్నపాటి శాటిలైట్లను మోసుకెళ్లింది. చంద్రుని నమూనాలను తిరిగి తీసుకురావడానికి , భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి ఈ శాటిలైట్ల డాకింగ్ ప్రయోగం చాలా కీలకమైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News