Friday, December 20, 2024

ఫైనల్లో స్పెయిన్

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్పెయిన్ టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో స్పెయిన్ 21 గోల్స్ తేడాతో బలమైన ఫ్రాన్స్‌ను ఓడించింది. నెదర్లాండ్స్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే సెమీస్ మ్యాచ్ విజేతతో స్పెయిన్ ఫైనల్లో తలపడుతుంది. తొలి సెమీ ఫైనల్ పోరు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఇటు స్పెయిన్ అటు ఫ్రాన్స్ అద్భుత ఆటతో అలరించాయి. ఆట 9వ నిమిషంలో రండల్ కొలొ మువాని ఫ్రాన్స్‌కు తొలి గోల్ సాధించి పెట్టాడు. దీంతో ఫ్రాన్స్ 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ ఈ ఆనందం ఫ్రాన్స్ టీమ్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. 21వ నిమిషంలో స్పెయిన్ యువ సంచలనం లమైన్ యమల్ స్పెయిన్‌కు మొదటి గోల్ అందించాడు.

దీంతో స్కోరు 11తో సమమైంది. ఆ వెంటనే డాని ఒల్మొ ఫ్రాన్స్‌కు రెండో గోల్ సాధించి పెట్టాడు. 25వ నిమిషంలో డాని ఈ గోల్ చేశాడు. దీంతో స్పెయిన్ 21 ఆధిక్యాన్ని అందుకుంది. ఆ తర్వాత ఫ్రాన్స్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ప్రథమార్ధంలో ఆధిక్యాన్ని కాపాడుకున్న స్పెయిన్ ద్వితీయార్ధంలో కూడా పైచేయి సాధించింది. ఫ్రాన్స్‌ను గోల్స్ చేయకుండా అడ్డుకున్న స్పెయిన్ మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News