Sunday, November 24, 2024

స్పెయిన్ ప్రధాని భార్యపై అవినీతి ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

మాడ్రిడ్: స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచెజ్ సతీమణి బెగొనా గోమెజ్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాను నడుపుతోన్న యూనివర్శిటీ మాస్టర్ డిగ్రీ కోర్సుకు స్పాన్సర్ల కోసం ప్రధాని సతీమణి హోదాను ఉపయోగించుకున్నారంటూ గోమెజ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాక్షిగా ప్రధానిని ప్రశ్నించేందుకు విచారణాధికారులు సమన్లు జారీ చేశారు. అధికారిక నివాసంలో జులై 30న ఆయనను న్యాయమూర్తి ప్రశ్నించనున్నారు. ఆయన సాక్షం ఈ కేసుకు కీలకం కానుందని పేర్కొన్నారు.

ఇటీవల గోమెజ్ విచారణకు హాజరైనా, జడ్జి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అలాగే తనపై వచ్చిన ఆరోపణలకు ఆమె ఇంతవరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, పెడ్రో మాత్రం విపక్షాల విమర్శల్ని తోసి పుచ్చుతున్నారు. ఈ ఆరోపణల కారణంగా ఏప్రిల్ లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని భావించి,తన విధుల నుంచి ఐదు రోజుల పాటు బ్రేక్ తీసుకున్నారు. కానీ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News