Thursday, November 14, 2024

ఝార్ఖండ్‌లో స్పెయిన్ పర్యాటకురాలిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

రాంచీ: భారత దేశంలో పర్యటిస్తున్న స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం దుమ్‌కా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. స్సెయిన్ దేశానికి చెందిన ఓ జంట బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు పర్యటనకు వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి బైక్‌పై ఝార్ఖండ్‌లోకి ప్రవేశించారు. దుమ్‌కా వద్దకు రాగానే చీకటి పడడంతో శుక్రవారం రాత్రి గుడారం వేసుకొని నిద్రకు ఉపక్రమించారు. స్థానిక యువకులు గమనించి ఆ జంటపై పాశవికంగా దాడి చేసి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గాయాలతో విదేశీ జంట కనిపించడంతో వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమెపై ఎనిమిది మంది అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు.

పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణంపై ఝార్ఖండ్ అసెంబ్లీ తీవ్ర చర్చ జరిగింది. భారత దేశం పరువును మంటకలిపారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. నిందితులకు రాజకీయ అండదండాలు ఉండడంతోనే వారు తప్పించుకొని తిరుగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పార్టీల వాదోపవాదాలతో సభ రెండు సార్లు వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News