Monday, December 23, 2024

స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్ లో ఘోరం జరిగింది. స్పెయిన్ కు చెందిన ఒక మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలోని డుంకా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్పెయిన్ దేశానికి చెందిన భార్యాభర్తలు రాత్రి 12 గంటల సమయంలో మోటార్ సైకిల్ పై డుంకా మీదుగా భాగల్పూర్ వెళ్తుండగా కొందరు దుండగులు వారిని అటకాయించారు. ఇద్దరినీ తీవ్రంగా కొట్టి, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. డుంకా ఎస్పీ పీతాంబర్ సింగ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News