Thursday, January 23, 2025

ఆగస్టు 2న ‘స్పార్క్’ టీజర్..

- Advertisement -
విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్ లై.ఫ్’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా టీజ‌ర్‌ను ఆగ‌స్ట్ 2న సాయంత్రం 6 గంట‌ల 45 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాత‌లు తెలిపారు. సోమ‌వారం టీజ‌ర్‌కు రిలీజ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో విక్రాంత్ ఇన్‌టెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. చేతిలో మాస్క్ పట్టుకుని, డార్క్ టోన్‌తో ఉన్న ఈ పోస్ట‌ర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో విక్రాంత్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, శ్రీకాంత్, కిర‌ణ్‌  అయ్యంగార్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News