Sunday, December 22, 2024

బిఆర్ఎస్ లో కెసిఆర్ తర్వాత ఆయనే !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానున్నది. ఈ సారైనా కెసిఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి హాజరవుతారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ‘‘ అసెంబ్లీకి కెసిఆర్ రావాలని తాను కోరుకుంటున్నానని, తెలంగాణను 10 ఏళ్లు పాలించిన కెసిఆర్  కు మంచి రాజకీయ అనుభవం ఉందని, ఆయన వస్తే నేను సంతోషిస్తాను. కెసిఆర్ సభకు వచ్చి ఏవైనా సూచనలు చేస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు అన్నారు. తాను కూడా మనస్ఫూర్తిగా ఆయన సభకు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

‘‘బిఆర్ఎస్ లో కెసిఆర్ తర్వాత హరీశ్ రావు కీలక నేత, హరీశ్ రావుకు  చాలా అనుభవం ఉంది. రాజకీయంగా చాలా విషయాలు తెలిసిన వ్యక్తి, ఆయన కోరిన వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చాను. అపాయింట్ మెంట్ బిజెపికి ఇవ్వలేదన్నదానిని నేను ఖండిస్తున్నాను. కెటిఆర్ స్నేహితుడే అయినా స్పీకర్ కు మిత్రుడికి సంబంధం లేదు. పార్టీ ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాననేది రాబేయే రోజుల్లో తెలుస్తుంది’’ అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News