Monday, December 23, 2024

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన స్పీకర్

- Advertisement -
- Advertisement -

Pocharam srinivas reddy discharge from hospital

కామారెడ్డి:  పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను శాసన సభాపతి  పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. నిన్న సాయంత్రం నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి వద్ద జరిగిన లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో పిట్లం మండలం చిల్లర్గి వాసులు ఆరుగురు కాగా, పెద్దకొడపగల్ మండలం తుగ్దల్, కాటేపల్లి, బాన్సువాడ పట్టణానికి సంబంధించిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. బాన్సువాడ ఏరియా హస్పిటల్ లో తీవ్రంగా గాయడి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే అధికారులను, వైద్యులను పోచారం ఆదేశించారు.

స్థానిక జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లతో కలిసి ఈరోజు చిల్లర్గి గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ ఘటనపై స్పీకర్, బిబి పాటి, కలెక్టర్ సంతాపం వ్యక్తం చేసి వారిని ఓదార్చారు. మృతదేహాలకు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడకు చెందిన మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాక్సిడెంట్ మృతులకు ఒక్కొకరికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News