Thursday, December 26, 2024

మాధవనంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్

- Advertisement -
- Advertisement -

కుల్చారం: మెదక్ జిల్లా కుల్చారం మండలం రంగంపేట శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి ఆశ్రమాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్  సందర్శించారు. స్పీకర్ కు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆశ్రమంలో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు అర్చకులు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  స్వామి చాతుర్మసా దీక్ష సందర్భంగా ఆశ్రమంలో పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, తదితరలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News