Thursday, December 26, 2024

స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అవి మూమూలే అని కొట్టిపారేశారు. పార్టీ ఫిరాయింపులు బిఆర్ఎస్ హయాం కాలం నుంచే జరుగుతున్నాయని, దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పనిలేదని అన్నారు.

భారత రాష్ట్ర సమితి పారీట బి-ఫామ్ మీద గెలిచిన ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు చేపట్టాలని బిఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ లపై స్పందించిన హైకోర్టు ఫిరాయింపు నేతలపై వేటు వేయాలని, లేదంటే తామే సమోటోగా చర్యలు చేపడతామని అసెంబ్లీ స్పీకర్ కు తాఖీదులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఫిరాయింపు ఎంఎల్ఏలపై చర్యలు ఉంటాయా లేవా అన్నది త్వరలో తేలనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News