- Advertisement -
కామారెడ్డి: బాన్సువాడ పట్టణంలోని ఎస్టీ పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్‌ను శుక్రవారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో మౌళిక సదుపాయాలను పరిశీలించి, బాలికలకు అందుతున్న భోజనం, ఇతర ఆహార పదార్థాల రుచి, నాణ్యతను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. అన్ని బాగా ఉన్నాయని తెలుపడంతో స్పీకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ విజయ, స్థానిక నాయకులు, విద్యార్థినీలు, హాస్టల్ సిబ్బంది తదితరులున్నారు.
- Advertisement -