హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు గాంధీజీఅని పేర్కొన్నారు. ఆయన చూపించిన మార్గం ఒక మన దేశానికే కాదు యావత్తు ప్రపంచానికి మార్గదర్శి అయిందన్నారు. గాంధీజీ జయంతిని దేశ విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించడం మన జాతికి గర్వకారణమన్నారు. గాంధీజీ ఆశయాలను అనుసరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్,ప్రభుత్వ విప్ ఏం .ఎస్ ప్రభాకర్ రావు,ఎమ్మెల్యేలు కోనేరు కొనప్ప, చందర్ రావు,ఎమ్మెల్సీలు దయనంద్,దండే విఠల్, ఎల్ రమణ,ఫరూక్ హుస్సేన్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు,టి ఆర్ యస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతిపితకు నివాళులర్పించిన స్పీకర్ పోచారం, మండలి చైర్మన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -