Monday, December 23, 2024

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం: స్పీకర్ పోచారం

- Advertisement -
- Advertisement -
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
తెలంగాణ ఏర్పాటు ఆయ్యాకే రాష్ట్రం అభివృద్ధి
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం
కోటగిరి మండలం సుద్దులంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం

 

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం కోటగిరి మండలంలోని సుద్దులం గ్రామంలో 48 డబుల్ బెడ్ రూం ఇండ్లు గృహ ప్రవేశం చేసి లబ్దిదారులకు అందజేశారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను నిజాంసాగర్ కెనాల్ పైన నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా కెసిఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అవి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ముఖ్యమంత్రి సహకారంతో 10వేల డబుల్ బెడ్ రూంలు మంజూరు చేశానని అందులో సగానికి పైగా పూర్తి అయ్యాయని మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయని పోచారం తెలిపారు. ఇంకా నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం అందని వారు ఆందోళన చెందకూడదని త్వరలో రానున్న రూ. 3 లక్షల ఇళ్ల స్కీమ్ లో అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అందజేస్తానని ఆయన హామీనిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించాలని కెసిఆర్ మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు సిఎం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టడం చూసి తాడు బొంగరం లేని వారు ఓర్వలేక అక్కడక్కడ పిచ్చి కూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈకార్యక్రమంలో ఎంపిపి వల్లేపల్లి సునీత, జడ్పీటిసి శంకర్ పటేల్, స్థానిక సర్పంచ్ గోపు సాయిలు, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షులు ఏజాస్ ఖాన్, కొత్తపల్లి విండో అధ్యక్షులు సునీల్‌కుమార్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, హౌసింగ్ డిఈ నాగేశ్వర్‌రావు, ఆర్‌డబ్లుఎస్ డిఈ మున్నీనాయక్, ఎమ్మార్వో శ్రీకాంత్‌రావు, ఇంచార్జి ఎంపిడివో మారుతి, నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్‌రావు, నీరడి గంగాధర్, బర్ల మధుకర్, సలీం, ఉప సర్పంచ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News