- Advertisement -
హైదరాబాద్: బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అనుమతించలేదు. తమ సస్పెన్షన్ పై ముగ్గురు బిజెపి ఎంఎల్‌ఎలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, సస్పెన్షన్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు పేర్కొంది. స్పీకర్‌ను కలవాలని హైకోర్టు ఎమ్మెల్యేలకు సూచించింది. దీంతో తమ సస్పెన్షన్ పై హైకోర్టు తీర్పును బిజెపి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునంతన్ రావులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం ఈ విషయంపై బిజెపి ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిశారు. అయితే, ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ నిరాకరించారు. సభలోకి ముగ్గురు ఎమ్మెల్యేలను అనుమించేదిలేదని స్పష్టం చేశారు. దీంతో బిజెపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్లిపోయారు.
Speaker Pocharam not allowed BJP MLAs to Assembly
- Advertisement -