Monday, December 23, 2024

నా నీడలా వెన్నంటే ఉండే వ్యక్తి భగవాన్ రెడ్డి: పోచారం

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు భగవాన్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాలకు ఎంతో సుపరిచితుడు. స్పీకర్ అందుబాటులో లేని సమయంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, చరవాణి ద్వారా తెలియజేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కృషిచేస్తున్నారు. ఇటీవల బాన్సువాడ ఎస్‌ఆర్ ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన రూ.1.70 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహాన్ని స్పీకర్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవాన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. మంచి వ్యక్తి భగవాన్ రెడ్డి అని, నిస్వార్థంగా, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని, నా వెన్నంటే నా నీడలా ఉంటూ, నేను అందుబాటులో లేని సమయంలో సైతం ప్రజలతో మమేకమై వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారన్నారు. అలాగే బాన్సువాడ నియోజకవర్గంతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు, ప్రజలు వస్తుంటారని, విద్యార్థులకు, ప్రజలకు ఏది ఉన్నా వెంటనే సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తున్నారని, ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుని వస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News