Thursday, January 23, 2025

బిధూరి, అలీ ఇద్దరిపైనా హక్కుల కమిటి విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇద్దరు ఎంపిల వ్యవహారశైలిపై ఇప్పుడు పార్లమెంట్ హక్కుల కమిటీ విచారణ జరుపుతుంది. బిఎస్‌పికి చెందిన ఎంపి డానిష్ అలీపై లోక్‌సభలో వారం రోజుల క్రితం బిజెపి ఎంపి రమేష్ బిధూరి పరుస వ్యాఖ్యలు వెలువరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం సభా హక్కుల కమిటికి నివేదించారు. కాగా ఇప్పుడు ఈ ప్యానెల్ బిధూరిపై ఫిర్యాదులతో పాటు అలీపై కూడా విచారణ జరుపుతుంది. బిఎస్‌పి ఎంపి ప్రధాని నరేంద్ర మోడీపై సభలో దూషణలకు దిగినందునే , కవ్వింపు చర్యకు పాల్పడినందునే బిధూరీ ఎదురుదాడికి దిగారని కొందరు బిజెపి ఎంపిలు తెలిపారు.

లోక్‌సభలో బిధూరి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తం అయింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభ్యుడి తరఫున క్షమాపణలు తెలిపారు. కాగా బిధూరిపై తక్షణ కఠిన చర్య తీసుకోవాలని స్పీకర్ ఓంబిర్లాకు కాంగ్రెస్, ఎన్‌సిపి ఇతర పార్టీలు లేఖలు పంపించాయి. ఈ దశలోనే దీనికి కౌంటర్‌గా బిజెపి ఎంపీల నుంచి స్పీకర్‌కు వివరణల లేఖలు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ ఇద్దరు ఎంపీల వ్యవహారశైలిపై విచారణకు సభా హక్కుల కమిటీ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News