Wednesday, January 22, 2025

లోక్‌సభ ప్రతిష్ఠంభనపై పార్టీ నాయకులతో స్పీకర్ సమావేశం విఫలం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభలో స్పీకర్ ఓమ్ బిర్లా ప్రతిష్ఠంభనను ముంగించేసేందుకు పిలిచిన సమావేశం ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. పార్టీలు తమ వ్యతిరేకతను వదులుకోడానికి ఇష్టపడలేదు. అభిజ్ఞ వర్గాల ప్రకారం అధికార పక్షం బిజెపి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ వైఖరిని వదులుకోడానికి ఒప్పుకోలేదు. కాగా లోక్‌సభ సమావేశానికి అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు.

సభా కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని అన్ని పార్టీలకు స్పీకర్ బిర్లా విజ్ఞప్తి చేశారు. అయితే బిజెపి కానీ, కాంగ్రెస్ కానీ తమ వైఖరిని సడలించడానికి ససేమీరా అన్నాయి. ఎంపీ రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి లోక్‌సభ కార్యకలాపాలను కొనసాగనివ్వలేదు. కాగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) దర్యాప్తు జరపాలని కోరాయి.

వారం గడిచినప్పటికీ ఉభయసభలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా వృథా చేశాయి. అధికార పక్షం, ప్రతిపక్షాలు ఏడు రోజులైనా పట్టు సడలించలేదు. ఆటంకాల మధ్య కేంద్ర బడ్జెట్ (ఆర్థిక బిల్లు)పై చర్చ జరుగనే లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News