Wednesday, January 22, 2025

బిజిగీర్‌షరీఫ్ దర్గాలో ఈటల మొక్కులు

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: జమ్మికుంట మండలం బిజిగీర్‌షరీఫ్ గ్రామంలో జరుగుచున్న ఉర్సు ఉత్సవాలలో భాగంగా ఆదివారం మాజీ మం త్రి, హుజురాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొని ఇంకుషావలికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్గాలో ప్రత్యేక ప్రా ర్థనలు చేసిన ఈటల రాజేందర్ అనంతరం దర్గాలో సమాధులకు చాదర్లు సమర్పించారు.

అనంతరం దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ఉపా ధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్‌కరీం, కార్యనిర్వహక అధ్యక్షుడు మహ్మద్ తౌఫిక్‌హుస్సేన్, కార్యదర్శి మహ్మద్ జమాల్‌అష్రఫ్, కోశాధికా రి మహ్మద్ మహమూద్, సంయుక్త కార్యదర్శి మహ్మద్ నయిమొద్దీన్, సభ్యులు అహ్మద్, లతీఫ్ హుస్సేన్, అజం, జలీల్, హైదర్, తాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, భాజపా సంపత్‌రావు, మల్లేష్, గౌతంరెడ్డి, నసీరుద్దీన్, తిరుపతి, జానీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News