Monday, January 20, 2025

సువర్ణమ్మకు విశేష హారతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీకాళహస్తి సువర్ణముఖి నదికి మంగళవారం సాయంత్రం గంగా హారతులు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం ముందుగా అమ్మవారిని విశేషంగా అలంకరించి సువర్ణముఖి నది వద్ద ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుస్తారు. ఇక్కడ ఆరుగాట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఎల్‌ఎ బి.మధుసూదన్ రెడ్డి, ఆలయ ధర్మకర్త, చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు జ్యోతి వెలిగించి శ్రీకారం చుట్టారు.

ఈ మేరకు వేద పండితులు వేద పారాయణం చేశారు. ధూపం, దీపం, రథ హారతి, చక్ర హారతి, ఏక హరతి,ద్వితీయ హారతి, తృతీయ హారతి ,చతుర్ధ హారతి, పంచ బ్రహ్మ హారతి, కుంభహారతి, చత్రం వింజమరం, దామరము, దర్పణం వేలాయుధం, కర్పూర హారతి మంత్రపుష్పం, కర్పూరాల కలహారతులు నిర్వహించారు. ఈ హారతుల్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపాతండాలుగా తరలివచ్చారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆలయ ఈవో కె.ఎస్. రామారావు, ఈఈ నూకరత్నం ,డిఈ శ్రీనివాసుల రెడ్డి,ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఈ కార్యక్రమ హారతులను రాజేష్ గురుకుల్, సూరి గురుకుల్, నిరంజన్ గురుకుల్, రఘునాథ గురుకుల్, కమల్ గురుకుల్, వేద పండితులు మారుతి శర్మ ,నారాయణ గురుకుల్ ,ప్రభాకర్ శర్మ ,విశ్వనాథ బట్టు, వశిష్ట ,శ్రీ వాస్తవ ,ఆంజనేయ అవధాని హేమంత్ శర్మలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News