Monday, December 23, 2024

సభ్యుల ఖాతాల్లోకి నేరుగా నిధులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చడమే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. మహిళా సంఘాల సభ్యులు పొదుపు చేస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు. వీరిని సాంకేతిక వినియోగానికి తీసుకెళ్లేందుకు తాజాగా లోకోస్ కన్వర్జెన్సీ యాప్ తెచ్చారు. మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ కింద వచ్చే రుణాలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనుంది. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్(ఎస్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా మహిళా అభ్యున్నతికి కేటాయించే నిధులను ఈ యాప్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా పొదుపు సంఘాలు (ఎస్‌హెచ్‌జి) బ్యాంకర్లు ఏటా లింకేజీ రుణాలు అందిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పి ముందుకు సాగుతున్నారు.

సభ్యులకు సంబంధించిన సమాస్త సమాచారం లోకోస్ కన్వర్జెన్సీ యాప్‌లో నిక్షిప్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించడంతో అధికారుల ఆదేశాలతో క్షేత్రస్థాయి సిబ్బంది ఇప్పటికే ఈ ప్రక్రియ చేపట్టారు. సంఘంలో చేరిన తర్వాత ఆర్థిక ప్రగతి, పొందిన రుణాలు, వాయిదాల చెల్లింపు, వడ్డీ, స్త్రీనిధి రుణాలు, ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం, లాభాలు, ఖర్చుల వివరాలను సభ్యురాలి వారీగా యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలకు సంబంధించిన సమాచారం ఢిల్లీలోని జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్(ఎస్‌ఆర్‌ఎల్‌ఎం)కి అనుసంధానమవుతుంది. ఉన్నతాధికారులు కార్యాలయం నుంచే ఏ సంఘం సమాచారమైనా తెలుసుకొని.. వారి కార్యకలాపాలపై ఆరా తీసే అవకాశం ఉంటుంది. లోకోస్ యాప్ ఇప్పటికే అమల్లో ఉంది.

దీనికి తోడుగా కన్వర్జెన్సీ యాప్‌ను తాజాగా తెచ్చారు. సంఘం సభ్యురాలికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు నవీకరణే లక్ష్యంగా రూపొందించారు. ఆధార్, చరవాణి నంబరు, బ్యాంక్ ఖాతా వివరాల్లో ఏమైనా మార్పులుంటే వెంటనే ఇందులో చేర్చనున్నారు. సభ్యురాలు ప్రస్తుతం సంఘంలో కొనసాగకుంటే అందుకు కారణాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వలస వెళ్లినా, ఇతర గ్రూపుల్లో చేరినా ఆ వివరాలూ పొందుపరుస్తున్నారు. తద్వారా సంఘాల అభ్యున్నతికి సత్వర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.
నేరుగా ప్రయోజనాలు..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చడమే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ కింద వచ్చే రుణాలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనుంది. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్(ఎస్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా మహిళా అభ్యున్నతికి కేటాయించే నిధులను ఈ యాప్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News