Wednesday, January 22, 2025

విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక యాప్..

- Advertisement -
- Advertisement -

విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక యాప్, ఆన్‌లైన్ పోర్టల్‌లు
వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్ నాణ్యతలపై ఫిర్యాదు చేయవచ్చు
గ్రీవెన్స్‌సెల్ వినియోగదారుల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది
సిజిఆర్‌ఎఫ్ ఆవిష్కరణలో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు

మనతెలంగాణ/హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక యాప్‌ను, ఆన్‌లైన్ పోర్టల్‌ను (వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను(సిజిఆర్‌ఎఫ్)) రూపొందించామని, దీనిని ప్రజలు వినియోగించుకోవాలని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్యేక యాప్‌ను విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ శ్రీరంగారావు, టిఎస్‌ఎస్పీడిసిఎల్ సిఎండీ రఘుమారెడ్డిలు సంయుక్తంగా ఈఆర్సీ కార్యాలయంలో సోమవారం వారు ప్రారంభించారు. సింగరేణి భవన్‌లోని ఈఆర్సీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిజిఆర్‌ఎఫ్‌కు సంబంధించిన వివరాలను ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈఆర్సీ చైర్మన్ మాట్లాడుతూ.. ఈ యాప్ ద్వారా విద్యుత్‌కు సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్ నాణ్యతలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయవచ్చని, అధికారుల పని తీరుపై కూడా ఇందులో సమాచారం ఇవ్వొచ్చన్నారు. గ్రీవెన్స్‌సెల్ వినియోగదారుల సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని ఆయన తెలిపారు.

విద్యుత్‌కు సంబంధించి ఏ సమస్యనైనా గ్రీవెన్స్‌సెల్ తీసుకుంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా సమాచారం ఇవ్వొచ్చని, గ్రీవెన్స్ సెల్ సమస్య పరిష్కారం చూపెట్టకపోతే అంబుడ్స్‌మెన్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని ఈఆర్సీ చైర్మన్ తెలిపారు. వేలాడుతున్న తీగలను సవరించడం, డెవలప్‌మెంట్ చార్జీలను వినియోగదారులకు తెలియ కుండా వేయడం తదితర సమస్యలపై సిజిఆర్‌ఎఫ్‌లో ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. స్టాండర్డ్ ఆఫ్ ఫెర్మామెన్స్, సిజిఆర్‌ఎఫ్‌తో పాటు ఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వులను త్వరలో తెలుగులో ప్రింట్ చేయించి ప్రజలకు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ప్రజలకు విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన కల్పించేలా ఈఆర్సీ చర్యలు చేపడుతుందన్నారు.

Special App for Power Problems in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News