Monday, December 23, 2024

మరాఠా కోటా పరిష్కారానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం : విపక్షాల డిమాండ్

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఆందోళన రానురాను హింసాత్మకంగా మారుతున్నందున ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు మంగళవారం డిమాండ్ చేశాయి. ఈమేరకు మహారాష్ట్ర విపక్ష నాయకుడు విజయ్ వడెట్టియార్ బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మరాఠా సమాజానికి బూటకపు హామీలు ఇవ్వడం, పొరపాటు నిర్ణయాలు తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణంగా ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడారు. “ బీజేపీ నిర్వాకం వల్ల అగ్గి రాజుకుందని, రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారుతున్నాయని, అందువల్ల వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా తయారైందన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్ ఈ రిజర్వేషన్ సమస్య రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోందని పేర్కొన్నారు.

30 రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఆ మాట నిలుపుకోలేదని విమర్శించారు. ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని కోరారు. ఇదే సమయంలో మరాఠా సమాజ్ సభ్యులు రిజర్వేషన్ ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ నాగ్‌పూర్ లోని గాంధీ గేట్ ఏరియా మహల్ వద్ద నిరాహార దీక్షచేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News